ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నిర్మల్ బస్టాండ్
రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. నిర్మల్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో పెద్ద ఎత్తున మహిళలు పండగవేళ ఊళ్లబాట పట్టారు. బస్సులు ఎక్కేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. బస్సుల వెంట పరిగెత్తడం, తోపులాటలు, నెట్టివేతలు జరిగాయి. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది రోప్ వేలు, బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించారు. ప్రతీ బస్సుకు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో బస్టాండ్‌కు రావడం, అదే విధంగా బస్టాండ్ నుంచి బయల్దేరడం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


