మామడ: చదువుతోపాటు విద్యార్థులు విభిన్న క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినుల ప్రతిభను కిక్ బాక్సింగ్‌లో గుర్తించిన కోచ్‌లు మరింత మెలకువలు నేర్పించారు. బాక్సింగ్‌లో రాటుదేలిన బాలికలు కిక్ బాక్సింగ్‌లో రాణిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయికి నక్షత్ర
మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన రేఖ, రమేశ్ దంపతుల కూతురు నక్షత్ర జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కిక్‌బాక్సింగ్‌పై నక్షత్రకు ఉన్న ఆసక్తిని గమనించిన కోచ్‌లు బాక్సింగ్ మెలకువలు నేర్పించారు. దీంతో ఆమె 2024లో జార్ఖండ్‌లో, 2025లో మహారాష్ట్రలోని పూణేలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రస్థాయిలో 65 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన ఖేలో ఇండియా కిక్‌బాక్సింగ్ వెస్ట్ జోనల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రస్థాయిలో సుజల సత్తా..
నల్దుర్తికే చెందిన లక్ష్మి, నాగరాజు దంపతుల కూతురు సుజల కూడా జిల్లా కేంద్రంలోని క స్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతోంది. కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుని ప్రతిభ కనబరుస్తోంది. ఖేలో ఇ ండియా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో 55 కిలోల విభాగంలో వెండి పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.


