రాఖీ.. బ్రో | - | Sakshi
Sakshi News home page

రాఖీ.. బ్రో

Aug 28 2026 2:39 AM | Updated on Aug 28 2026 2:39 AM

వాతావరణం ● ఎక్కడున్నా పుట్టింటికి తోబుట్టువులు ● అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ● నేడు రాఖీ పండుగ

ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.

నాకు ఎంతో స్పెషల్‌

లండన్‌ నుంచి వచ్చిన..

చెన్నూర్‌రూరల్‌: నా పేరు అనూష. మాది చెన్నూర్‌ మండలం పొక్కూరు గ్రామం. పెళ్లి తర్వాత లండన్‌లో స్థిరపడ్డాం. నా భర్త అక్కడే జాబ్‌ చేస్తాడు. ఏటా రాఖీ పండుగకు లండన్‌ నుంచి స్వగ్రా మం వచ్చి అన్నయ్య గద్దె మధుకర్‌కు రాఖీ కట్టి వెళ్తాను. ఈయేడు కూడా రెండ్రోజుల ముందుగానే వచ్చి రాఖీ కట్టాను. స్వయంగా వచ్చి రాఖీ కట్టడమే ఇష్టం. ఒక్కోసారి వచ్చే వీలు లేకుంటే ముందుగానే రాఖీ పంపిస్తాను. – గద్దె అనూష, లండన్‌

కై లాస్‌నగర్‌: రాఖీ పండగ నాకు ఎంతో స్పెషల్‌. మా అమ్మా, నాన్నలకు నేను ఏకై క సంతానం. నాకు తోబుట్టువులు లేరు. కానీ మా పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్నల కూతుళ్లు అర్చన, నిఖిత, అంజమ్మ నాకు సొంత అక్కాచెల్లెళ్ల లెక్కనే. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు వారు ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కడుతారు. ఉద్యోగ బాధ్యతల పరంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ మరచిపోకుండా రాఖీ కట్టేందుకు వస్తారు. నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతారు. అన్నాచెల్లెళ్ల అనుబంంధానికి ప్రతీకగా నిలిచే ఈ రక్షబంధన్‌ను ఎంత గొప్పగా జరుపుకుంటామో అంత గొప్పగానే మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలి. ప్రతీ ఒక్కరూ ఎదుటి మహిళ, యువతులను తమ సొంత ఆడపడచులుగా భావించినప్పుడే వేధింపులు లేని ఆదర్శసమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. – మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్‌

ఖానాపూర్‌: దేశ సేవలో భాగంగా ఆర్మీలో 15 ఏళ్లకుపైగా విధులు నిర్వహించాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విధుల కారణంగా రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అక్కాచెల్లెళ్ల నుంచి ఫోన్‌లో శుభాకాంక్షలు అందుకున్నా, వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోలేకపోవడం బాధగా ఉండేది. ప్రస్తుతం ఆర్మీ నుంచి విరమణ పొందాను. రెండేళ్లుగా రాఖీ పండుగను అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకుంటున్నాను. అక్కల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ సమయంలో కోల్పోయిన ఆత్మీయ క్షణాలను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాను. దేశ సేవలో భాగంగా పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.

– కడుకుంట్ల ప్రవీణ్‌, ఖానాపూర్‌

అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ వారధిగా నిలుస్తోంది. ఏ దేశంలో ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు పుట్టింటి బాట పట్టేలా చేస్తుంది. ఏ ఒక్క ఏడాదైనా రాఖీ కట్టలేకపోతే అన్నాదమ్ముల ఆత్మీయతకు దూరమయ్యామనే భావన కలిగిస్తుంది. ఆ భావన కూడా రావొద్దనే ఉద్దేశంతో అక్కాచెల్లెళ్లు ఎంత కష్టమైనా భరించి వచ్చి రాఖీ కడితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. తరాలు మారినకొద్దీ రాఖీ అనుబంధాన్ని మరింత దృఢం చేస్తోంది.

ఎన్నడూ మరువలేదు..

నిర్మల్‌చైన్‌గేట్‌: మా అన్నయ్య ఉద్యోగరీత్యా అండమాన్‌లో సీజీఎంగా విధులు నిర్వహించేవారు. విధి నిర్వహణలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. నేను కూడా నిర్మల్‌ జిల్లా అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా ప్రతీ రక్షాబంధన్‌ రోజు కలుసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. అయినప్పటికీ నేను రాఖీ పండుగకు రాఖీ పంపడం ఎన్నడూ మరువలేదు. ఈసారైనా అన్నయ్యకు నా చేతులతో రాఖీ కట్టాలని అనుకుంటున్న.

– విజయలక్ష్మి, నిర్మల్‌ డీఆర్డీవో

ఎదురుచూస్తుంటా..

చింతలమానెపల్లి: ఇంటికి దూరంగా దేశసేవ కోసం సరిహద్దుల్లో ఉండే మా సైనికులకు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకం. పోస్ట్‌లో స్వగ్రామం నుంచి పంపించే రాఖీ కట్టుకుంటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతీ ఏడాది రాఖీ పౌర్ణమికి ఇంటి నుంచి వచ్చే రాఖీ కోసం ఎదురుచూస్తుంటా. – హరి మ్రిదా, రవీంద్రనగర్‌, మం.చింతలమానెపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement