నిర్మల్‌చైన్‌గేట్: హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన పట్టారు. పీఆర్సీ అమలులోపాటు పెండింగ్ డీఏ లు, బిల్లులు విడుదల, సీపీఎస్ రద్దుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో కొన్నాళ్లుగా నిరసన తెలుపుతున్నారు. ఈక్రమంలోనే అన్ని సంఘాల పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగా ణ ఉద్యోగ జేఏసీ (టీజీఈ జేఏసీ)గా ఏర్పడి గురువారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. తొలుత మున్సిల్ కార్యాల యం ఎదుట ఉన్న అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, పీఆర్సీ నివేదిక ఫిట్మెంట్ ప్రకటన, ఆరు విడతల కరువు భత్యం, ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, నూతన పెన్షన్ విధానం రద్దు, ఉద్యోగి 1.5 శాతం కాంట్రిబ్యూషన్‌తో నగదు రహిత ఆరోగ్య కార్డుల సక్రమ అమలు ఐదు ప్రధాన డిమాండ్లతో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
హక్కుల కోసం ఐక్యంగా..
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రెండో పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల విడుదల, ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు, హెల్త్ కార్డుల పూర్తిస్థాయి అమలు వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి.
– ఎంసీ లింగన్న, టీజీఈ జేఏసీ గౌరవ అధ్యక్షుడు


