నిర్మల్: ‘పండుగలప్పుడు తప్పకుండా కొంటారు..! బస్టాండ్ ఏరి యా కదా.. ఏది పెడితే అది తీ సుకుంటారు..’ అన్న నమ్మకంతో కొంతమంది వ్యా పారులు విక్రయిస్తున్న నాణ్యత, శుభ్రత లేని స్వీట్ల పై ‘అక్కా.. గీ మిఠాయి మంచిదేనా..!’ అంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ఆహార భద్రత అధికారులు స్పందించారు. జిల్లా ఇన్‌చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, రెండుశాఖల సిబ్బందితో కలిసి గురువారం జిల్లాకేంద్రంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విక్రయదారులతోపాటు తయారీదారులకు, హోటళ్లు, స్వీట్‌హోమ్‌లకూ నోటీసులు అందించారు.
బస్టాండ్ ప్రాంతంలో..
అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి అక్కాచెల్లెళ్లు బస్సెక్కి వెళ్తుంటారు. ఇలా వెళ్లేటప్పుడు రాఖీలతోపాటు స్వీట్లనూ తీసుకుంటూ ఉంటారు. స్వీట్‌హోమ్ వరకూ వెళ్లడం దూరం, సమయభావం అని అక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని చాలామంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి సంబంధించి ఎలాంటి ప్రమాణాలనూ పాటించడం లేదు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ సునీత, మున్సిపల్ అధికారులతో స్వీట్లను పరిశీలించారు.
శాంపిల్స్ తీసుకుని..
ప్రమాణాలు పాటించకుండా స్వీట్లు ఇతరత్రా తినుబండారాలు తయారు చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వడమే కాకుండా వారి తయారీ కేంద్రాల నుంచి ఫుడ్ శాంపిళ్లనూ తీసుకున్నారు. 15 రోజుల్లో వీటికి సంబంధించి ఫలితాలు వస్తాయని వాటిని బట్టి కేసుల నమోదు చేస్తామని తెలిపారు.
స్పందన
‘ఫుడ్.. పాయిజన్’పైనా..
జిల్లాకేంద్రంలో కాలం చెల్లిన కేక్‌ను తిని ఓ చిన్నారికి ఫుడ్‌పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలైంది. ఈ ఘటనపై ఈనెల 22న ‘ఫుడ్.. పాయిజన్’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికీ అధికారులు స్పందించారు. స్థానిక బస్టాండ్ ఏరియాలో ఎవర్‌గ్రీన్ హోటల్‌ను తనిఖీ చేసి, నోటీసులు ఇచ్చారు. కేకులను తయారు చేసి హోటల్‌కు విక్రయించిన వారినీ విచారిస్తామన్నారు. అలాగే నారాయణ, ఢిల్లీవాలా స్వీట్‌హోమ్‌లలోనూ పలు శాంపిళ్లను తీసుకున్నారు.


