22ఏ లోపాలు పోర్టల్‌లోనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

22ఏ లోపాలు పోర్టల్‌లోనే పరిష్కరించాలి

Aug 28 2026 2:39 AM | Updated on Aug 28 2026 2:39 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

భైంసాటౌన్‌: జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో నమోదైతే వాటిని గు ర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి నివేదిక అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. భూభారతి, 22ఏ, సమ గ్ర రీసర్వేపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా వీసీలో పాల్గొన్నా రు. భూభారతి డేటా ఆధారంగా జిల్లాలో ఎక్కడైనా 22ఏ ఎక్స్‌టెంట్‌లో లోపాలు ఉంటే వాటని పోర్టల్‌లోనే పరిష్కరించాలని సూచించారు. ఎస్‌ఆర్‌వోలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకుని సమగ్రంగా భూరీసర్వే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేయాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

మెరుగైన విద్య అందించాలి

విద్యార్థినులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల పరి సరాలు పరిశీలించారు. ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో ఎంఈవో సుభాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, హాజరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న భోజనం, సిలబస్‌ వివరాలను ఎస్‌వో జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. గణిత, భౌతికశాస్త్రం నుంచి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సమాధానాలు చెప్పిన విద్యార్థినులను అభినందించారు. బహుమతులు అందజేశారు.

ఎంఈవో, ఎస్‌వోకు షోకాజ్‌ నోటీసులు..

పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య లోపంపై ఎంఈవో సుభాష్‌తోపాటు, విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్‌ ఎస్‌వో జ్యోతి కి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని డీఈవో భోజన్న ను ఆదేశించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. వారివెంట ఎంపీవో ప్రదీప్‌, ఎంపీడీవో నీరజ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement