నిర్మల్‌చైన్‌గేట్: అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఎస్‌ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహెర్ బీన్ ఆమ్దాన్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(ఎస్‌ఐఆర్)లో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామం, సిద్ధల కుంట, లక్ష్మణచాంద మండలం బాబాపూర్, మామడ మండలం కొరటికల్, దిమ్మదుర్తి, దిలావర్పూర్ మండలం కంజర్, మాడెగాం, నర్సాపూర్ మండలం, నర్సాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. సర్‌లో భాగంగా విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేర్లలోనైనా తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్ పాల్గొన్నారు.


