నిర్మల్‌చైన్‌గేట్: పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప ట్టణంలో గురువారం నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశా రు. అనంతరం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిలే తక్షణమే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, కౌన్సిలర్లు వోడిసెల అర్జున్, సూరజ్ నాయక్, బీజేవైఎం నాయకులు వెంకటేశ్, హరీశ్, జుట్టు దినేశ్, భారత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు పాల్గొన్నారు.


