న్యూస్‌రీల్
జిల్లాలో 2,22,054 మందికి నోటీసులు 27నుంచి ఆధారాలు అందించాల్సిందే సెప్టెంబర్ 20న ముగియనున్న ప్రక్రియ అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా నేడు జిల్లాలో గ్రామ, వార్డు సభలు
నిర్మల్
ఆక్రందన ఆగేదెప్పుడో!
ఐటీడీఏకు ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కావడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు వినిపించే వేదిక కూడా కరువైందని వాపోతున్నారు.
దూదిగొండలే స్పెషల్
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైంసా డివిజన్‌లో ప్రత్యేక సంప్రదాయానికి వేదికగా రాఖీ పండుగను నిర్వహిస్తారు. ఇక్కడ రాఖీ పౌర్ణమిని ‘గొండల పున్నమి’గా పిలుస్తారు.
బాసరలో అలివేటి మండప నిర్మాణానికి భూమిపూజ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆ లయంలో అలివేటి మండప నిర్మాణానికి బుధవారం వేదపండితుల ఆధ్వర్యంలో భూమిపూ జ చేశారు. స్థానాచార్యుడు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, శ్రీమా తృ కలశ స్థాపన కార్యక్రమాలను నిర్వహించా రు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.354 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గర్భగుడి, ఉపాలయాల మండపాలను కృష్ణశిలలతో రూ.31 కోట్ల వ్యయంతో దాత సహకారంతో నిర్మిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అలివేటి మండప నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు ఆలయ ఈవో అంజనాదేవి, అధికారులు తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి మలిదశ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితా లో చేరిన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ యా మండలాల్లో ఏఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న తహసీల్దార్లు ఆ నోటీసులపై విచారణ చేపడతారు. నోటీస్ అందుకున్నవారు తమ వద్ద ఉన్న ఆధారాల ను చూపడంతో పాటు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20లోపు ఈ ప్రక్రియ ముగియనుంది. అక్టోబర్ 19న ఫైనల్ జాబితా విడుదల చేస్తారు.
కొత్త ఓటరు నమోదుకు అవకాశం
ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబి తాను బూత్ స్థాయి అధికారులు చదివి వినిపించి అందుబాటులో ఉంచుతారు. అర్హులు జాబితాలో లేకున్నా, చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటు, గ్రా మాలు పట్టణాలను విడిచి ఇతర ప్రాంతా ల్లో నివా సముంటున్న ఓటర్లను గుర్తిస్తారు. 2026 అక్టోబర్ 1వరకు 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా న మోదు చేసుకోవచ్చు. జాబితాలో వివరాలు తప్పుగా ఉంటే సవరణకు, అనర్హుల ఓటర్లను తొలగించేందుకు ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలుపవచ్చు. సెప్టెంబర్ 16వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యా దు చేసుకునే అవకాశముంది. వచ్చిన ఫిర్యాదులు అక్టోబర్ 15వరకు పరిశీలించి పరిష్కరించనున్నా రు. అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
బీఎల్వోలు, బీఎల్‌ఏలే కీలకం
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కాలంటే బీఎల్వోలు, బీఎల్‌ఏల పాత్ర కీలకంగా మారనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19న అ న్ని రాజకీయ పార్టీల నేతలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న బీఎల్వోలు ఓటర్లకు సర్ ప్రక్రియపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఓటర్లకు నోటీసులు అందజేసే సమయంలో దాని ఉద్దేశం, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన ధ్రువపత్రాల వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. డిక్లరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 16వరకు కొనసాగనుంది. నోటీసులు, రీ–హియరింగ్, క్లెయిమ్స్‌కు సంబంధించిన ప్రక్రియ వచ్చేనెల 20వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరుకు ఓటు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితా విశ్వసనీయంగా ఉండేలా సమష్టి కృషి చేసేందుకు నాయకులు సహకరించాల్సిన అవసరముంది.
ఆధారాలు చూపాల్సిందే..
జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో నోటీసులు అందుకున్నవారు కేటాయించిన తేదీల్లో ఏఈఆర్వోలుగా ఉన్న తహసీల్దార్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. 2002లో తమతోపాటు తమ కుటుంబ పెద్దలకు సంబంధించిన ఓట్ల వివరాలు ఆధారాలతో అధికా రులకు చూపించాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు ని రూపితమైతే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఏమేం అందించాలంటే..
ఈ నెల 25వరకు నోటీసుల
జనరేషన్, డెలివరీ వివరాలు
ఖానాపూర్ నియోజకవర్గం
జనరేట్ చేయాల్సినవి 68,090
జనరేట్ అయినవి 68,050
జనరేషన్ కోసం పెండింగ్ 39
డెలివరీ అయినవి 2,403
డెలివరీ కాకుండా పెండింగ్ 65,647
నిర్మల్ నియోజకవర్గం
జనరేట్ చేయాల్సినవి 83,383
జనరేట్ అయినవి 83,360
జనరేషన్ కోసం పెండింగ్ 23
డెలివరీ అయినవి 791
డెలివరీ కాకుండా పెండింగ్ 82,569
ముధోల్ నియోజకవర్గం
జనరేట్ చేయాల్సినవి 70,581
జనరేట్ అయినవి 70,581
జనరేషన్ కోసం పెండింగ్ 0
డెలివరీ అయినవి 301
డెలివరీ కాకుండా పెండింగ్ 70,280
జిల్లా వ్యాప్తంగా ఇలా..
జనరేట్ చేయాల్సినవి 2,22,054
జనరేట్ అయినవి 2,21,991
జనరేషన్ కోసం పెండింగ్ 62
డెలివరీ అయినవి 3,495
డెలివరీ కాకుండా పెండింగ్ 2,18,496
నేడు గ్రామ, వార్డు సభలు
సర్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాను బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్ల సమక్షంలో చదివి వినిపించనున్నారు. ఫారం–6, 7, 8 అందుబాటులో ఉంచనుండగా అభ్యంతరాలుంటే అప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అనామలిస్ (ఓటర్ల వివరాలలో లోపం), మ్యాపింగ్ కాని (పాత, ప్రస్తుత రికార్డులో లేనివారు) ఓటర్లకు సంబంధించిన వివరాలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు బీఎల్వోలు అందించనున్నారు.
ఘనంగా మిలాద్–ఉన్–నబీ
నిర్మల్‌టౌన్: మిలాద్–ఉన్–నబీ సందర్భంగా హజరత్ గౌసే అజాం దస్తాగిర్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ముస్లింలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రఽ దాన రహదారుల మీదుగా ర్యాలీ కొనసాగింది. ప్రవక్త మహ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సహనం లాంటి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ర్యాలీ చేపట్టారు. మహ్మద్ ప్రవక్త బోధనాలను ప్రతి ఒక్కరూ అ నుసరించి ఆయన చూపిన మార్గంలో నడవా లని మత పెద్దలు సూచించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలు, అధికసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.


