వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

వాతావరణం ● 6–10 తరగతులవారికి అవకాశం ● సృజనాత్మకతను వెలికితీసేందుకే..

సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.
విద్యార్థుల కు రచనా పోటీలు

లక్ష్మణచాంద: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని పోత్సహించేందుకు తెలంగాణ సాహి త్య అకాడమీ ప్రత్యేక పోటీలు నిర్వహిస్తోంది. బాలల దినోత్సవం సందర్భంగా కథ, కవిత, గేయం, పాట, పద్యం, నాటికలు తదితర వి భాగాల్లో పోటీలు నిర్వహంచనుండగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 6–10 తరగతుల విద్యార్థులకు అవకాశం కల్పించింది. జిల్లాలో 795 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాల, అన్ని గురుకుల పాఠశాలలుండగా 60,239 మంది, 227 ప్రైవేట్‌ పాఠశాలలుండగా 69,751 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 1,022 పాఠశాలల్లో 1,29,990 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, జీవ న విధానం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వ్య క్తులు, భాష తదితర అంశాలపై 26 ఫంక్తులకు మించకుండా రచనలు చేయాలి. రచనలను ‘తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌–500004’ అనే చిరునామాకు సెప్టెంబర్‌ 30లోపు పోస్టులో పంపాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి తెలిపారు. పూర్తి వివరాలకు 9184245692 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వారితో రచనలు చేయించాలని జిల్లా విద్యాధికారి భోజన్న సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement