భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఓనం | - | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఓనం

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

ఖానాపూర్‌: ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ప్రత్యే క గుర్తింపు సంపాదించుకున్న కేరళీయులు దేశంలో నూ విద్య, వైద్యం తదితర రంగాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. ఖానాపూర్‌ పట్టణంలో ని కేరళ హైస్కూల్‌లో కేరళీయులు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ఓనం వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఓ నం వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే పే ర్కొన్నారు. కులమతాలకు అతీతంగా కేరళీయులు సంఘటితంగా ఓనం వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఓనం వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. కేరళీయులు అనితామోల్‌, పీజే సాబు, వినితా, జ్యోతిర్మయన్‌, జగన్‌ మయాన్‌, అనీశ్‌, శ్రీకళ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కేరళీయుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేను సన్మానించారు. నాయకులు చిన్నం సత్యం, గాడ్పు సత్యం, జంగిలి శంకర్‌, పోలంపెల్లి రమేశ్‌, బక్కశెట్టి కిశోర్‌, దయానంద్‌, జహిర్‌ అహ్మద్‌, కుత్‌బొద్దీన్‌, లక్ష్మీపతిగౌడ్‌, రాజునాయక్‌, సత్యం, శ్యా మ్‌, శేఖర్‌, శివ, శంకర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement