ఖానాపూర్: సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలోని శ్రీనివాస గార్డెన్‌లో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర తొమ్మిదో మహాసభల ప్రచార పోస్టర్‌ను బుధవారం పట్ట ణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఆవరణలో ఆవిష్కరించారు. సంఘం నాయకులు మాట్లాడా రు. మహాసభలకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి అధ్యక్షత వహిస్తారని, ప్రముఖ రచయిత, విమర్శకుడు కె.శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేస్తారని, జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామ య్య ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కార్యదర్శి ఎల్‌ఆర్ ఉపాలి, సంయుక్త కార్యదర్శి గోగు శేఖర్, కోశాధికారి కుడుదుల రాజేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు మానుక శ్రీనివాస్, నాయకులు గుట్ల ప్రసాద్, గోనె స్వామి, నాగవత్ రవి తదితరులున్నారు.


