న్యూస్‌రీల్
డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్
నిర్మల్
● తేలుతున్న అక్రమాల లెక్క
అక్కా.. మిఠాయి మంచిదేనా..!?
రక్షాబంధన్ రోజు సోదరులకు రాఖీలు కట్టిన తర్వాత అక్కాచెల్లెళ్లు ప్రేమతో మిఠాయి తినిపించడం ఆనవాయితీ. ఈ మిఠాయిల నాణ్యత ఆందోళన కలిగిస్తోంది.
సీతారామ రైస్ మిల్లు తనిఖీ
లోకేశ్వరం: మండలంలోని పుస్పూర్ గ్రామ సమీపంలోని సీతారామ రైస్‌మిల్‌ను మంగళవారం విజిలెన్సు అధికారులు తనిఖీ చేశారని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాము రాథోడ్ తెలిపారు. మిల్లులో కేవలం 25,575 వరిధాన్యం ధాన్యం బస్తాలే ఉన్నాయాని అధికారులు గుర్తించారు. రూ.14.10 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని నిర్ధారించారు. మిల్లు యజమాని మహేందర్‌రెడ్డి అందుబాటులో లేరని తెలిపారు.
భైంసాటౌన్: జిల్లాలోని రైస్‌మిల్లులపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల వరుస దాడులతో మిల్లర్లు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా, అధికార ప్రతిపక్ష అనే వివక్ష చూపకుండా మిల్లర్ల అక్రమాల లెక్క తేలుస్తున్నారు. ఈ తనిఖీలతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సీఎంఆర్ కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఒక సీజన్‌లో కేటాయించిన ధాన్యం సకాలంలో సీఎంఆర్ అప్పగించకుండా విక్రయించుకోవడం, మరో సీజన్‌లో కేటాయించిన ధాన్యం మరాడించి సీఎంఆర్ అప్పగిస్తూ వచ్చారు. విజిలెన్స్ తనిఖీలతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏ మిల్లుకు వెళ్లినా రూ.కోట్ల విలువైన ధాన్యం కనిపించడం లేదు.
డీఫాల్ట్ రూ.556 కోట్లు..
జిల్లాలో 2017–18 నుంచి 2025–26 సీజన్లకు సంబంధించి రూ.556 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2022–23, 2023–24 సీజన్లలోనే అధిక మొత్తంలో మిల్లర్లు సీఎంఆర్ ఎగవేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, టెండర్ ధాన్యంకు సంబంధించి 1.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సైతం మిల్లర్లు బకాయి ఉండగా, వీటి విలువ రూ.296.42 కోట్లు. ఇప్పటివరకు పలువురు మిల్లర్ల నుంచి దాదాపు రూ.21.26 కోట్లకుపైగా రికవరీ చేశారు.
ముధోల్, లోకేశ్వరంలోనే ఎక్కువ...
జిల్లాలో ఇటీవల విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో లోకేశ్వరం, ముధోల్ మండలాలకు చెందిన రైస్ మిల్లుల్లోనే ఎక్కువ మొత్తంలో అక్రమాలు జరిగిన ట్లు తెలుస్తోంది. లోకేశ్వరం మండలం సాథ్‌గాంలోని శ్రీగజానన్, నగర్‌లోని కేఎస్‌ఆర్, శ్రీలక్ష్మీనర్సింహా మిల్లుల్లో రూ.55.76 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టింది. సాథ్‌గాంలోని శ్రీసాయి రైస్‌మిల్లులో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో రేషన్‌బియ్యం లారీ పట్టుబడ డం గమనార్హం. ఇదే మిల్లుల్లో రూ.9 కోట్లకుపైగా ధాన్యం సైతం మాయమైనట్లు తనిఖీ ల్లో గుర్తించారు. ఇక ముధోల్ మండలంలోని ఏసియన్, శ్రీగణపతి రైస్‌మిల్లులకు సంబంధించి 2024–25 సీజన్లకు చెందిన రూ.23.23 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. తాజాగా ధాన్యలక్ష్మి రైస్‌మిల్లులో ధాన్యం లోటు గుర్తించి కేసు నమోదు చేశారు.
పర్యవేక్షణ లేకనే..
జిల్లాలో సీఎంఆర్ కోసం కేటాయించిన రూ.కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టడం సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ప్రతీ సీజన్‌లో పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగించిన మిల్లులకే అధికారులు ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అధికారులు క్షేత్రస్థాయిలో తూతూమంత్రం తనిఖీలు చేసి రికార్డుల్లోనే ధాన్యం నిల్వలు చూపుతూ వస్తున్నారు. డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారి వారి పరిధిలోని రైస్‌మిల్లుల్లో తరచూ ధాన్యం నిల్వలు, అప్పగించిన బియ్యం రికార్డులు తనిఖీ చేసి, ఎప్పటికప్పుడు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి అందించాలి. విజిలెన్స్ తనిఖీలతో రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్లు వెల్లడవుతోంది.
తనిఖీ చేస్తున్న విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాలిలా..
రైస్ మిల్లు లోటు ధాన్యం(మె.ట) విలువ(రూ.కోట్లలో)
శ్రీ గజానన్, సాథ్‌గాం 2205.721 రూ.8.45
శ్రీలక్ష్మీనర్సింహా
(బాయిల్డ్), స్వర్ణ 6019.977 రూ.25.18
శ్రీలక్ష్మీనర్సింహా, స్వర్ణ 2477.696 రూ.10.48
ఏఆర్‌ఎస్, సత్తనపల్లి 9639.962 రూ.40.96
శ్రీలక్ష్మీనర్సింహా, నగర్ 5750.33 రూ.24.36
కేఎస్‌ఆర్ ఆగ్రో, నగర్ 5385.246 రూ.22.94
కుభీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన నందిని హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి సకాలంలో కళాశాలకు హాజరు కావాలంటే, ఒకరోజు ముందుగా బయలు దేరడం, లేదా ముందురోజు రాత్రి భైంసాకు చేరుకుని బంధువుల ఇంట్లో బస చేసి ఉదయాన్నే హైదరాబాద్ బస్సులో బయలుదేరాల్సి వస్తుంది. ఇలా విద్యాభ్యాసం లేదా ఉద్యోగ, వృత్తిరీత్యా హైదరాబాద్, నిజామాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లే ఎంతోమంది గ్రామీణ ప్రాంతవాసులు నైట్‌హాల్ట్ బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతవాసులకు ఇలాంటి ఇబ్బందులు తీరనున్నాయి.
దేగాంలో రూ.11.64 కోట్ల ధాన్యం మాయం
భైంసాటౌన్: మండలంలోని దేగాంలో ఉన్న శ్రీరామ రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. డీఎస్పీ సీతారెడ్డి ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో రూ.11.64 కోట్ల విలువైన టెండర్ ధాన్యం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. 2022–23 సీజన్‌కు సంబంధించి సదరు మిల్లులో 5,967 మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, 716 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. తనిఖీ సమయంలో మిల్లు యజమాని లేకపోవడంతో డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రకాశ్ రాథోడ్ సమక్షంలో పంచనామా చేశారు. వారి వెంట విజిలెన్స్ డీటీ శ్రీనివాస్, సీఐ రవీందర్, రూరల్ ఎస్సై సుప్రియ ఉన్నారు.


