భైంసాటౌన్: దాదాపు పదేళ్ల తరువాత ఆర్టీసీ మళ్లీ నై ట్‌హాల్ట్ బస్సులు పునరుద్ధరించనుంది. ఈ మేరకు అవసరమైన రూట్లు గుర్తించేందుకు స్మార్ట్ షెడ్యూలింగ్‌కు ఆదేశించింది. జిల్లాలోని చాలావరకు గ్రా మాలకు నైట్‌హాల్ట్ సర్వీసులు లేక ఆయా గ్రామాల ప్రజలు దూరప్రాంతాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ నిర్ణయంతో ఇలాంటివారికి ప్రయోజనం చేకూరనుంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపో పరిధిలో 230 బస్సు సర్వీసులు నడుపుతున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, ఇతర దూరప్రాంతాలకు వెళ్లాలంటే గ్రామీణులు నిర్మల్, భైంసా బస్టాండ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అంతేగాక, కూరగాయలు, పండ్లు విక్రయించే రైతులు సైతం పట్టణ కేంద్రాలకు చేరుకోవాలంటే ఉదయం గ్రామానికి వచ్చే బస్సే ఆధారం. బస్టాండ్ నుంచి ఉదయం సర్వీసు ఆ గ్రామానికి చేరుకుని, తిరిగి వారు పట్టణాలకు చేరుకోవాలంటే సమయం మించిపోతుంది. ఇలాంటివారికి నైట్‌హాల్ట్ సర్వీసుల పునరుద్ధరణతో ఉపశమనం కలుగనుంది.
ప్రజల విజ్ఞప్తి మేరకు నడుపుతాం..
భైంసా డిపో పరిధిలో ఇప్పటికే నైట్‌హాల్ట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని సర్వీసులు విస్తరించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే, ప్రజల విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటాం. అవసరాన్ని బట్టి నైట్‌హాల్ట్ సర్వీసులు పునరుద్ధరిస్తాం.
– హరిప్రసాద్, డీఎం, భైంసా


