ఆన్‌లైన్‌లో ట్రిపుల్‌ ఐటీ ధ్రువపత్రాలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ట్రిపుల్‌ ఐటీ ధ్రువపత్రాలు

Aug 26 2026 12:24 AM | Updated on Aug 26 2026 12:24 AM

బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆ ఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ) విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ‘ఆర్జీయూకేటీ హబ్‌’ ద్వారా ఈ సేవలను ప్రారంభించినట్లు ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. దీంతో దూర ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థుల వ్యయప్రయాసలు తగ్గడంతోపాటు విద్యార్థినులకు కూడా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

అందుబాటులో ఇవీ..

ఆన్‌లైన్‌లో నో డ్యూ సర్టిఫికేట్‌, ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ రిక్వెస్ట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. బోనాఫైడ్‌, కండక్ట్‌, టీసీ, గ్రేడ్‌ కార్డు, ట్రాన్స్‌క్రిప్ట్‌, మార్కుల మెమో, మైగ్రేషన్‌, ప్రొవిజనల్‌, డిగ్రీ తదితర ధ్రువపత్రాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించి పోస్టు ద్వారా లేదా నేరుగా ధ్రువపత్రాలు పొందవచ్చు. దరఖాస్తు స్థితిని లైవ్‌ ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఉత్తీర్ణులైన బీ20 బ్యాచ్‌ విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ ఈ సేవలను ప్రారంభించారు. త్వరలో మిగిలిన బ్యాచ్‌లకు విస్తరించనున్నారు. ఇప్పటికే మాన్యువల్‌గా దరఖాస్తు చేసినవారు మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆర్జీయూకేటీ హబ్‌ వెబ్‌సైట్‌లో ఐడీ వివరాలతో లాగిన్‌ కావాలి. అవసరమైన ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. సాంకేతిక సమస్యలుంటే పరీక్షల విభాగం లేదా సంబంధిత ఈమెయిల్‌లో సంప్రదించాలని అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ అసోసియేట్‌ డీన్‌, అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement