న్యూస్‌రీల్
నిర్మల్
వంతెన నిర్మాణమెప్పుడో..
లక్ష్మణచాంద మండలం పీచర సమీపంలో ధర్మారం–సోన్ రోడ్డు ఏటా వర్షాలకు తెగిపోతోంది. అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారు.
క్రమశిక్షణతో సమర్ధవంతంగా విధులు
నిర్మల్‌టౌన్/ఖానాపూర్: పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ టౌ న్, రూరల్, సోన్, ఖనాపూర్ సర్కిల్ పరిధి పో లీస్ సిబ్బందికి నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో, ఖానాపూర్ ప్రభుత్వ మైదానంలో వేర్వేరుగా శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. నిర్మల్‌లో డీఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై సూచనలు చేశారు. విధినిర్వహణతోపాటు, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల ని సూచించారు. ఖానాపూర్‌లో సీఐ సత్యనారాయణ ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ ఠాణాల ఎస్సైలు, 45 మంది పోలీసులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐలు కృష్ణ, గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు జ్యోతి. లోకేశ్వరం మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన శారద ఉదయం లేవగానే అటవీ ప్రాంతానికి వెళ్లి ముళ్ల చీపురు పుల్లలు కోసుకొస్తుంది. మధ్యాహ్నం ఇంటికి చేరుకుని పుల్లలు శుభ్రం చేసి కట్టలు కట్టి ఆరబెడుతుంది. సాయంత్రం ఇదివరకే ఆరిన కట్టలను తీసుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో ఒక్కో చీపురు రూ.10 నుంచి రూ.20లకు విక్రయించి ఉపాధి పొందుతోంది. ఇంత చేస్తే ఆమెకు రోజు రూ.200 వరకు వస్తుంది.
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ’మూల’ ధనము హా హా నీవే !
అని ఓ కవి చీపురు ప్రాముఖ్యతను ఇలా కవిత రూపంలో రాశాడు. కానీ నాటి వైభవం నేడు చీపురుకు లేదు. పాతకాలంలో చేతివృత్తులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. తమ చేతివృత్తులతో ఉపాధి పొంది కుటుంబాలను పోషించేవారు. ప్రస్తుతం కులవృత్తులకు ప్రత్యామ్నాయాలు రావడంతో డిమాండ్ తగ్గి, కుటుంబ పోషణ భారంగా మారింది. దశబ్దాలుగా చీపుర్ల తయారీని నమ్ముకున్న మండలంలోని లక్ష్మీనగర్ గ్రామస్తులు ప్లాస్టిక్ చీపుర్ల రాకతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు.
వివరాలు..
సేవాలాల్‌తండా అనుబంద గ్రామం
: లక్ష్మీనగర్ తండా
మొత్తం ఓటర్లు : 280
కుటుంబాలు : 80
జనాభా : 470
పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది


