కోర్టులను తనిఖీ చేసిన హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

కోర్టులను తనిఖీ చేసిన హైకోర్టు జడ్జి

Aug 23 2026 1:52 AM | Updated on Aug 23 2026 1:52 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానం, జిల్లా పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తి కె.సుజన శనివారం తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీ లించి, కేసుల నిర్వహణ, రికార్డుల భద్రత, న్యాయస్థానంలో అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల పరి ష్కారం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసే అంశాలపై న్యాయమూర్తులతో చర్చించారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు, సిబ్బంది అవసరాలు, కోర్టు కార్యకలాపాల నిర్వహణను పరిశీలించారు. అనంతరం నిర్మల్‌ రూరల్‌ మండలం రాణాపూర్‌ గ్రామ శివారులో నిర్మిస్తున్న కోర్టు భవన సముదాయ పనులను పరిశీలించారు. భవన నిర్మాణంలో ఇప్పటివరకు పూర్తయిన పనులు పరిశీలించి, మిగిలిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అటవీశాఖ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, బైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాధిక, రవీందర్‌, నిఖిత, భవిష్య, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ చంద్రమోహన్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ రాజారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement