డ్రై డేతో వ్యాధులు దూరం | - | Sakshi
Sakshi News home page

డ్రై డేతో వ్యాధులు దూరం

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

లక్ష్మణచాంద: ప్రతీ శుక్రవారం డ్రై డే పాటిద్దాం.. దోమలను నివారిద్దాం అని జిల్లా వైధ్యధికారి రాజేందర్‌ అన్నారు. మండలంలోని పీచరలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామ ప్రజలకు డ్రై డే ప్రాముఖ్యతపై వివరించారు. ఇంటి పరిసరాల్లో నీరునిల్వ ఉండకుండా చూసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల వృద్ధికి అనుకూలమైన ప్రదేశాలు గుర్తించి నివారించడంపై అవగాహన కల్పించారు. డెంగీ, మలేరియా దోమలతో వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, నీటి నిల్వలు తొలగించి దోమల నివారణలో భాగస్వాములు కావా లని సూచించారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రవీందర్‌, హెచ్‌ఈవో నటరాజ్‌గౌడ్‌, ఏఎన్‌ఎంలు కళ్యాణి, వనజ, ఆశా కార్యకర్తలు సునీత, పుష్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement