ముధోల్: విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఆధ్యాపకులు కృషి చేయాలని డీఐఈవో పరశురాం సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగ్స్, షూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, నోట్స్ పుస్తకాలను పరిశీలించి సూచనలు అందజేశారు. సబ్జెక్టులకు గడువులోగా పూర్తి చేసి, ప్రాక్టికల్స్ సకాలంలో చేయించాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రహ్మాన్, ఆధ్యాపకులు గంగాధర్, శ్రీనివాస్, నారాయణ, శంషొద్దీన్, స్వరూప, సురేశ్ ఉన్నారు.


