లోకేశ్వరం: మండలంలోని నగర్ ప్రాంతంలో ఉన్న రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. కేఎస్‌ఆర్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా సుమారు 5,385.246 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీని విలువ సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. ఇక శ్రీలక్ష్మీనరసింహ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా సుమారు 5,746 మెట్రిక్ టన్ను ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారని తెలి సింది. దీని విలువ సుమారు రూ.13 కోట్లు ఉంటుందని సమాచారం. రెండు రైస్ మిల్లుల యజమానులు శ్రీనివాస్, కె.మాధవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


