నార్నూర్: మండలంలోని నాగల్‌కొండ గ్రామానికి చెందిన షేక్ అసిఫ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూ నియర్ కళాశాలలో చదువుకున్న షేక్ అసిఫ్ స్టేట్ 1,419వ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ కౌ న్సెలింగ్‌కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్ర మహదు, మసీదు కమిటీ సదర్ హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు షేక్ అసిఫ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో షేక్ అజమ్, షేక్ యూసుఫ్ పటేల్, షేక్ నబీ సాబ్, షేక్ వజీర్ పాషా, షేక్ అజర్, మసీదు కమిటీ, గ్రామ కమిటీ సభ్యులున్నారు.
చోరీకి పాల్పడిన నిందితుల అరెస్ట్
భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు భైంసారూరల్ సీఐ ప్రవీణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దేగాం గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం చోరీ జరిగింది. సబ్‌స్టేషన్‌లోని 33 కేవీ ఏబీ స్విచ్‌లకు సంబంధించిన మూడు కాపర్ పైపులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీటి విలువ సుమారు రూ.20వేలుగా అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ తలారి పోశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీతోపాటు ఇతర ఆధారాలు పరిశీలించి నిందితులను గుర్తించారు. చోరీకి పాల్పడిన మహారాష్ట్రలోని మురలి గ్రామానికి చెందిన కృష్ణారాథోడ్, పొన్నే రాజ్‌రాథోడ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. ఎస్సై సుప్రియ, సిబ్బంది ఉన్నారు.


