లక్ష్మణచాంద: పంట మార్పిడి విధానంతో అ ధిక లాభాలు పొందవచ్చని నిర్మల్ డివిజనల్ హార్టికల్చర్ అధికారి మౌనిక అన్నారు. సోన్ మండలం కూచన్‌పెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఒకేవిధమైన పంటలు సాగు చేయడం వల్ల నేల సారం కోల్పోవడంతోపాటు దిగుబ డులు తగ్గుతాయన్నారు. పంట మార్పిడి పా టించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఎక్కువ పడే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో వరికి బదులు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, నూనె గింజల పంటలైన నువ్వులు, వేరుశనగ సాగు చేయాలని సూచించారు. లాభదాయకమైన ఆయిల్‌పామ్ సాగుచేయాలని తెలిపారు. సోన్ ఏఈవో ఉమామహేశ్వరి, సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ రాజమణి పాల్గొన్నారు.


