నిర్మల్‌టౌన్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి డీటీడీవో నిహారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆదివాసీ ఉద్యమ వీరులు కొమురంభీం, రాంజీగోండు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివా సీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ.. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీ యువత విద్య, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంద మల్లేశ్, నైతం భీంరావు, తొడసం శంభు, తొడసం గోవర్ధన్, ముసలి చిన్నయ్య, సాకి లక్ష్మణ్, సంచు శ్రీనివాస్, పెందోర్ మాధవరావు, పి.శంకర్, సంఘపు నర్సయ్య, ఈశ్వర్, సురేశ్, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


