అతివలకు ఆరు | - | Sakshi
Sakshi News home page

అతివలకు ఆరు

Jan 18 2026 6:57 AM | Updated on Jan 18 2026 6:57 AM

అతివలకు ఆరు

అతివలకు ఆరు

● బీసీలకు నాలుగు, జనరల్‌ రెండు, ఎస్సీ ఒకటి ● మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు కేటాయింపు ● ఉమ్మడి జిల్లాలో మహిళలకు అధిక అవకాశం ● పట్టణ పీఠాలు దక్కించుకునేందుకు వ్యూహాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘ ఎన్నికల రిజర్వేషన్లలో మహిళలకే పెద్దపీట దక్కింది. చైర్‌పర్సన్‌ స్థానాల్లో అధికంగా అతివలకే అవకాశం లభించింది. రాష్ట్రం యూనిట్‌గా చైర్‌పర్సన్‌, మేయర్‌ రిజర్వేషన్లలో సగానికి పైగా మహిళలకే దక్కాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా 11 మున్సిపాల్టీలు ఉండగా.. వీటిలో సగం స్థానాలు మహిళలకే రిజర్వు అయ్యాయి. ఇక వార్డులు, డివిజన్లలోనూ మహిళలకు 50శాతం ప్రాతినిధ్యం ఉంది. జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో మున్సిపాల్టీ పాలకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. రాజకీయ నాయకులు తమకు రిజర్వేషన్‌ కలిసి రాని చోట్ల తమ సతీమణులను పోటీలో నిలిపి పదవులు దక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇక కొందరు భార్యలతో కుదరకపోతే తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళలను పోటీలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల ఎంపిక కోసం ఆశావహులు దరఖాస్తులు, సర్వేలు, ప్రజల్లో బలంతో ఆర్థిక స్థితిగతులపై అంచనాలు వేశారు. ఈ మేరకు వార్డులు, డివిజన్లలో ప్రాథమికంగా ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేసుకున్నారు.

ప్రతిష్టాత్మకంగా పట్టణ ఎన్నికలు

పట్టణాల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని పీఠాలు దక్కించుకునేలా వ్యూహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు మున్సిపల్‌ పీఠాలను కై వసం చేసుకునేలా ప్రణాళికలు వేశారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పట్టణాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పట్టు పెంచుకో వాలని సిద్ధమయ్యారు. 2020లో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. నాటి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం మినహా అన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాల్టీలను కై వసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జోరుకు గండి పడి పది నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్యేల స్థానాలకు పరిమితం కాగా.. నాలుగు బీజేపీ, నాలుగు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్ని కల్లోనూ ఆదిలాబాద్‌ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్‌ గె లుచుకోగా.. రాజకీయంగా మార్పులు వచ్చాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సర్పంచులను గెలిపించుకుని ప్రభావం చూపించా రు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మంచిర్యాల తొలి మేయర్‌ బీసీలకే..

ఉమ్మడి జిల్లాలో ఏకై క మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంచిర్యాల. పట్టణం నుంచి అప్‌గ్రేడ్‌ అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో కీలకమైన మేయర్‌ పీఠం రిజర్వేషన్లలో బీసీలనే వరించింది. బీసీ జనరల్‌ కేటగిరీ కావడంతో ఆ వర్గ నాయకుల్లో ఆసక్తిని పెంచింది. పోటీలో నిలిచే బీసీ నాయకులు మేయర్‌ పీఠంపై కన్నేశారు. నగరంలో మొత్తం 1.81లక్షల ఓటర్లు ఉన్నారు. 60డివిజన్లతో ఓ అసెంబ్లీ నియోజకవర్గ పరిధితో సమంగా, పరిపాలనలోనూ ప్రత్యేక కనబర్చనుంది. దీంతో నగర ప్రథమ పౌరుడిగా రాజకీయంగా, ప్రొటోకాల్‌, అధికారిక హోదా విస్తృతంగా ఉండనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మేయర్‌ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి.

మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌

ఆదిలాబాద్‌ జనరల్‌ మహిళ

నిర్మల్‌ జనరల్‌ మహిళ

బెల్లంపల్లి జనరల్‌ మహిళ

క్యాతన్‌పల్లి జనరల్‌ మహిళ

కాగజ్‌నగర్‌ బీసీ మహిళ

చెన్నూరు బీసీ మహిళ

ఆసిఫాబాద్‌ బీసీ జనరల్‌

భైంసా జనరల్‌

ఖానాపూర్‌ జనరల్‌

లక్షెట్టిపేట ఎస్సీ జనరల్‌

మంచిర్యాల నగరం బీసీ జనరల్‌(మేయర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement