ఖానాపూర్‌లో వీబీజీ రామ్‌జీ అమలు చేయాలి
● కేంద్ర మంత్రికి బీజేపీ నేతల వినతి
ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోలో వీబీజీ రామ్‌జీ పథకం అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రీతీశ్ రాథోడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి శనివారం వినతిపత్రం అందించారు. ఖానాపూర్ పట్టణ ప్రజల విన్నపం మేరకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామరావ్ పటేల్‌తో కలిసి రితేష్ రాథోడ్, ఖానాపూర్ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. ఐదేళ్ల క్రితం ఖానాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేశారని తెలిపారు. గతంలో సుమారు 7 వేల జాబ్‌కార్డులు ఉండేవన్నారు. పథకం నిలిపివేయడంతో కూలీలకు ఉపాధి కరువైందని వెల్ల డించారు. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నందున వీబీజీ రామ్‌జీ పథకం తిరిగి ప్రారంభించాలని విన్నవించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్, మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్ ఉన్నారు.


