లాభంలేని ఎవుసం
న్యూస్‌రీల్
నిర్మల్
కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో శనివారం మండల పూజ నిర్వహించారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అయ్యప్ప స్వామికి 41 రోజుల మండల కాలం(వృశ్చిక మాసం నుంచి ధనుర్మాసం వరకు) ముగింపు సందర్భంగా హరిహర పుత్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. స్వాములతో కలిసి ఎమ్మెల్యే భిక్షలో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ ఉన్నారు.
నిర్మల్: వ్యవసాయ ఆధారిత జిల్లా నిర్మల్. 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా ఎవుసం కలిసి రావడం లేదు. ఏటా రైతులు నష్టాలతోనే సాగుతున్నారు. ఈ ఏడాదీ సాగు అంత సాఫీగా సాగలేదు. రైతన్నకు అవసరమున్నప్పుడు రాని వాన, వద్దంటే పగబట్టినట్టే కురిసింది. తెల్లబంగారాన్ని నేలవాల్చింది. సోయాపంటను నీటముంచింది. పచ్చని పొలాల్లో ఇసుక మేటలేసింది. జిల్లాలోని 16 మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, పత్తి, సోయా వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్ల, భారీవర్షాలకుతోడు దాదాపు సీజన్ అంతా గోదావరి ఉప్పొంగడంతో తీరప్రాంత మండలాల్లో పంటలు నీటమునిగాయి. ఇక కొత్తపంటగా సాగులోకి వచ్చిన ఆయిల్‌పామ్ ఈ ఏడాది కోతకు వచ్చింది. సాగుచేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసింది. పంట సాగు విస్తీర్ణం పెంచడానికి మరింత భరోసానిచ్చింది.
ముంచిన వానలు..
జిల్లాలో 2024–25 యాసంగి సీజన్‌లో మొత్తం 3,23,857 ఎకరాల్లో 1,77,066 మంది రైతులు పంటలు సాగు చేశారు. ఇక ఈఏడాది వర్షాకాలంలో 2,35,060 మంది రైతులు మొత్తం 4,37,897 ఎకరాల్లో పంటలు పండించారు. గతేడాది తీరునే ఈసారి కూడా ప్రకృతి వైపరీత్యాలు రైతన్నలను వెంటాడుతూ వచ్చాయి. ఖరీఫ్ సీజన్ మొదట్లో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 10,588 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అది మరిచిపోయేంత లోపే అక్టోబర్‌లో మోంథా తుపాన్ చుట్టుముట్టింది. వారాల తరబడి మబ్బుపట్టిన వాతావరణంతోపాటు కురిసిన వర్షాలకు జిల్లాలోని ఐదు మండలాల్లోని 36 గ్రామాల్లో 253 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక పంట నష్టపరిహారం కింద ఆగస్టు వైపరీత్యాలకు సంబంధించి రూ.10.69 లక్షలు విడుదలయ్యాయి. మోంథా తుపాన్ బాధితులకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి.
పెరిగిన సోయా.. తగ్గిన పత్తి..
జిల్లాలో గతంతో పోలిస్తే పలు ప్రధాన పంటల సాగులో ఈ ఏడాది కొంత తేడాలు కనిపించాయి. జిల్లాలో అత్యధికగా సాగు పంటగా వరి కొనసాగింది. యాసంగిలో 1,24,243 ఎకరాల్లో, వానాకాలం 1,41,667 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతేడాది సోయాపంటను 1,05 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1.21 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మరో ప్రధాన పంటగా ఉన్న పత్తి ఈఏడాది కొంత తగ్గింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 1.45 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు పత్తికి బదులుగా సోయాను నమ్ముకున్నారు. మిగతా మొక్కజొన్న, జొన్న, పసు పు పంటలు ఎప్పటి మోతాదులోనే సాగు చేశారు.
వరదలతో పొలాల్లో ఇసుక మేటలు(ఫైల్)
ఈఏడాది ప్రధాన పంటల
సాగువివరాలు(ఎకరాల్లో)..
పంటలు యాసంగి వానాకాలం
వరి 1,24,243 1,41,938
సజ్జ 495 ––
మొక్కజొన్న 98,723 16,163
జొన్న 41,033 10
సోయాబీన్ 59 1,21,693
పత్తి 57 1,51,265గోధుమ 543 ––
శనగ 48,932 ––
మినుములు 104 72
కంది 475 6,638
పెసర 0.39 87
నాలుగేళ్లక్రితం జిల్లాలోకి అడుగుపెట్టిన ఆయిల్‌పామ్ ఈ ఏడాది చేతికొచ్చింది. అనుమానాలను పటాపంచలు చేస్తూ మంచి దిగుబడితో కోతకొచ్చింది. జిల్లాలో మొత్తం 8,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఈ ఏడాది 600 ఎకరాల్లో కొత్తగా సాగుచేశారు. మొత్తం 36 నెలల పంటయిన ఆయిల్‌పామ్ నాలుగేళ్ల క్రితం సాగు ప్రారంభించిన రైతులకు చేతికొచ్చింది. మొత్తం 1,300ఎకరాల్లో పంట కోతకు రాగా, ఒక్కో గెల ఐదు నుంచి 8 కేజీలు ఉంది. మున్ముందు వచ్చే గెలల బరువు 20 కేజీల వరకూ ఉండనుంది. టన్నుకు రూ.19 వేల ధర పలుకుతుండగా, ఈఏడాదిలో మొత్తం 249 టన్నులను కోతకోశారు. ఇందుకు సంబంధించి మొత్తం 158 మంది రైతుల ఖాతాల్లో కొనుగోలు చేసిన కంపెనీ రూ.54 లక్షల పైచిలుకు జమచేసింది.
లాభంలేని ఎవుసం
లాభంలేని ఎవుసం
లాభంలేని ఎవుసం


