టెట్ నుంచి మినహాయించాలి
నిర్మల్ రూరల్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఈమేరకు కేంద్రం చట్ట సవరణ చేయాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికై న జుట్టు గజేందర్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా గజేందర్ ఎమ్మెల్యేకు పలు విద్యావిషయక అంశాలను వివరించారు. తమ సంఘంలో జిల్లా నుంచి రాష్ట్ర పదవికి అవకాశం రావడం ఇదే తొలిసారని తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలపై ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్, పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, నా యకులు ఇర్ఫాన్ షేక్, వెంకటేశ్వరరావు, లక్ష్మీపతి, లింగయ్య, అజీజ్ తదితరులు ఉన్నారు.
పోస్టర్లు విడుదల
నిర్మల్ రూరల్: ఈనెల 28, 29 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సమావేశం పోస్టర్లను టీఎస్ యూటీఎఫ్ నాయకులు జిల్లా కేంద్రంలో శనివారం విడుదల చేశారు. జనగాం జిల్లాలో జరిగే రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఇందులో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, అశోక్, రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, లక్ష్మణరావు, రమేశ్, పరమేశ్వర్, రాజేశ్వర్, నాగయ్య, గోవర్ధన్, శివరాణి, ఫాసిల్, రమేశ్, అంబటి నారాయణ, నారాయణవర్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


