విద్యార్థులకు విజ్ఞానం.. సైన్స్ ప్రయోగం..
మామడ: విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా సైన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇన్‌స్పైర్ ప్రాజెక్టులతోపాటు సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్మల్‌లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొంటారు. 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9, 10వ తరగతులు, ఇంటర్ వరకు చదువుతున్నవారు సీనియర్ (వైజ్ఞానిక) విభాగంలో పాల్గొనవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, స్థానిక సంస్థలు, ఆశ్రమ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్లు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికై న జిల్లాలోని 119 ప్రాజెక్టులు మేళాలో ప్రదర్శించబడతాయి. ప్రతీ పాఠశాల నుంచి అయిదు ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చు.
ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించాలి
జిల్లాలో 119 ప్రాజెక్టులు ఇన్‌స్పైర్‌కు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులతోపాటు సైన్స్‌ఫేర్ ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శిస్తారు. సాంస్కృతిక విభాగాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చవచ్చు.
– వినోద్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి
సైన్స్‌పై ఆసక్తి పెంచేలా..
సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ వంటి సైన్స్ మేళాలతో విద్యార్థుల్లో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
– భోజన్న, డీఈవో
ప్రదర్శన అంశాలు..
అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ దేశం కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంతోపాటు మొత్తం 7 అంశాల్లో ప్రాజెక్టులు నిర్వహించబడతాయి. ’ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం’ అంశంపై సెమినార్ నిర్వహిస్తారు.
1. సుస్థిర వ్యవసాయం
2. వ్యర్థ పదార్థాల నిర్వహణ,
ప్రత్యామ్నాయ మొక్కలు
3. హరిత శక్తి, పునరుత్పాదక శక్తి
4. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు
5. వినోదభరితమైన గణిత నమూనాలు
6. ఆరోగ్యం, పరిశుభ్రత
7. నీటి సంరక్షణ, నిర్వహణ
విద్యార్థులకు విజ్ఞానం.. సైన్స్ ప్రయోగం..
విద్యార్థులకు విజ్ఞానం.. సైన్స్ ప్రయోగం..


