‘కడెం’ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కడెం: ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కడెం ప్రాజెక్టు అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కాలువల మరమ్మతు, తదితర అంశాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. యాసంగి పంటల కోసం కడెం, సదర్మాట్ ఆయకట్టు రైతాంగానికి సాగు నీరందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అటవీ అనుమతులు కాలువల మరమ్మతుల ఆంశాలను సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు వేగవంతం చేస్తాం....
దస్తురాబాద్: గ్రామల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయని, రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేస్తామని బొజ్జు పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో సర్పంచ్ వర్ధెల్లి గోపాల్ అభినందన సభలో మాట్లాడారు. నూతన పింఛన్, మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి హామీ ఇచ్చారు. కొత్త సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.అరుణ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, ఆయా గ్రామాల సర్పంచులు మహేశ్, నరేశ్, రాజేశ్, భూమేశ్, నరేశ్‌రెడ్డి, గంగన్న నాయకులు పాల్గొన్నారు.


