నోటాకు ఓటేశారు | - | Sakshi
Sakshi News home page

నోటాకు ఓటేశారు

Dec 25 2025 10:12 AM | Updated on Dec 25 2025 10:12 AM

నోటాకు ఓటేశారు

నోటాకు ఓటేశారు

జిల్లాలో 1,416 మందికి సర్పంచ్‌ అభ్యర్థులు నచ్చలే.. అత్యధికంగా ముధోల్‌ మండలంలో 178.. అత్యల్పంగా దస్తూరాబాద్‌లో ఒక్కటే.. చెల్లని ఓట్లు 5,489

నిర్మల్‌చైన్‌గేట్‌: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో 1,416 మంది తమకు సర్పంచ్‌ అభ్యర్థి నచ్చలేదని నోటాకు ఓటు వేశారు. మొత్తం 4,31,791 మంది ఓటర్లల్లో 3,57,513 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 74,278 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.

బ్యాలెట్‌ పద్ధతిలో నూతన మార్పు

గతంలో మున్సిపల్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా నోటా ప్రవేశపెట్టారు. ఈసారి పంచాయతీల్లో బ్యాలెట్‌ పేపర్‌ చివరలో ఈ గుర్తును ముద్రించారు. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే తమ అసంతృప్తిని వ్యక్తీకరించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలోకి వచ్చింది. ముధోల్‌ మండలంలో అత్యధికంగా 178 మంది ఓటర్లు తమకు సర్పంచ్‌ అభ్యర్థులు నచ్చలేదని ఓటు వేశారు. దస్తూరాబాద్‌లో కేవలం ఒక్కరు మాత్రమే సర్పంచ్‌ నచ్చలేదని నోటాకు ఓటేశారు.

భారీగా చెల్లని ఓట్లు..

ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో చాలా మంది అభ్యర్థుల ఫలితాలు తారుమారయ్యాయి. ఈవీఎంలకు అలవాటైన ఓటర్లు బ్యాలెట్‌ పద్ధతిని మర్చిపోయారు. అభ్యర్థి పక్కన బాక్స్‌లో సరిగ్గా ముద్ర వేయలేకపోయారు. మూడు విడతల ఎన్నికల్లో మొత్తం 5,489 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కుభీర్‌ మండలంలో అథ్యధికంగా 699 చెల్లని ఓట్లు పోలయ్యాయి. నర్సాపూర్‌(జి) మండలంలో అత్యల్పంగా 58 చెల్లని ఓట్లు పడ్డాయి. ఇవి ఎవరికీ లాభం లేకుండా పోయాయి. కొందరి గ్రామాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీని తగ్గాయి. కొన్ని గ్రామాల్లో గెలిచే అభ్యర్థిని ఓడిపోయేలా చేశాయి.

మండలాలవారీగా నోటాకు వచ్చిన ఓటు,

చెల్లుబాటు కాని ఓట్లు

మండలం చెల్లుబాటు నోటాకు

కాని ఓట్లు వచ్చిన ఓట్లు

దస్తురాబాద్‌ 166 1

కడెం 405 100

ఖానాపూర్‌ 194 69

పెంబి 160 24

మామడ 337 86

లక్ష్మణచాంద 390 125

నిర్మల్‌ రూరల్‌ 310 56

సారంగాపూర్‌ 449 109

సోన్‌ 339 36

దిలావర్‌పూర్‌ 228 74

నర్సాపూర్‌(జి) 58 16

లోకేశ్వరం 487 88

కుంటాల 267 147

భైంసా 549 98

ముధోల్‌ 486 178

తానూర్‌ 531 85

బాసర 247 26

కుభీర్‌ 699 98

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement