అద్దె.. ఇక వద్దు!
● కార్యాలయాలు గాలిస్తున్న పలు శాఖలు
నిర్మల్: పేరుకు ప్రభుత్వ కార్యాలయం, ఉండేది మాత్రం ప్రైవేటు భవనంలో.. నెలకు వేల రూపాయల ప్రజాధనాన్ని అద్దె రూపంలో ప్రభుత్వం చెల్లి స్తోంది. అందుబాటులో ప్రభుత్వ భవనాలు ఉ న్నా.. ప్రైవేటు మోజులో పలుశాఖలు ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇకపై ఇలా ప్రజా ధనం వృథా చేయడం కుదరదు. ఈనెలాఖరు వర కు ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ కావాలంటూ ఆర్థికశాఖ స్పష్టం చేసింది. జనవరి నుంచి ఏరకంగానూ ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లించడం కుదరదని తెలిపింది. దీంతో.. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల అధికారులు సొంత భవనాల వెతుకులాటలో పడ్డారు. తమకు అనుకూలంగా ఎక్కడైనా ప్రభుత్వ భవనం ఉందా..! అని చూస్తున్నారు. మరో నాలుగైదు రోజులైతే మళ్లీ కొత్త నెల ప్రారంభమవుతుంది. ఆలోపే భవనాలను చూసుకోవాల్సి ఉంటుంది.
రూ.లక్షల్లో ప్రజాధనం వృథా..
జిల్లాలో ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉ న్నా.. పలు శాఖల కార్యాలయాలు ఇప్పటికీ ప్రై వే టు భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్నిజిల్లాలో సమీకృత కార్యాలయాల భ వనాలను నిర్మించింది. జిల్లాలోనూ ఎల్ల పెల్లి శివా రులో 15 ఎకరాల్లో రూ.56 కోట్లతో నిర్మించారు. సమీకృత కలెక్టరేట్ కట్టిన తర్వాత చాలావరకు కా ర్యాలయాలు అందులోకే షిఫ్ట్ అయ్యాయి. కానీ కొ న్ని కార్యాలయాలు ఇప్పటికీ ప్రైవేటు భవనాల్లో కొ నసాగుతున్నాయి. సమీకృత భవనంలో కేటాయింపులు లేక కొన్ని, ఉన్నా వెళ్లకుండా మరికొన్ని వేల రూపాయల అద్దె చెల్లిస్తూ ఆగిపోయాయి.
ప్రభుత్వ భవనాల వేట
కొత్త ఏడాదిలో అద్దెను ఏరకంగానూ చెల్లించేది లేదని ఆర్థికశాఖ స్పష్టంగా చెప్పడంతో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న శాఖలకు ‘షాక్’ తగిలినట్లయింది. ఉన్నపళంగా అధికారులు తమ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండని చెప్పారు. అలాగే కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు తమ పరిస్థితి వివరించారు. సమీకృత భవనంలో ఏమైనా ఖాళీలు ఉన్నాయా.. జిల్లా కేంద్రంలోనే ఏ శాఖ భవనమైనా ఖాళీగా ఉందా.. అని వెతుకుతున్నారు. ఈనెలాఖరులోపు ఎలాగైన కార్యాలయాలు ఖాళీ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలోనూ పలు శాఖలు..
జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పంచాయతీ, రెవెన్యూ, ట్రెజరీ తదితర శాఖల కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. రైతువేదికలు నిర్మించిన తర్వాత వ్యవసాయశాఖ ఆఫీసు కార్యకలాపాలు వాటి నుంచే నడిపిస్తున్నాయి. ఇక జిల్లాకేంద్రంలో ప్రధానంగా రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులు, పేఅండ్ అకౌంట్స్, చైల్డ్ వెల్ఫేర్ తదితర కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగే చైల్డ్‌ప్రొటెక్షన్ ఆఫీస్ కూడా ప్రైవేటు భవనంలోనే కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు స్థానిక దివ్యనగర్‌లో స్థలంతో కేటాయించారు. కానీ ఇక్కడ భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. జిల్లాలో అటవీ, ఇరిగేషన్ శాఖలు సొంతంగా భవనాలను నిర్మించుకున్నాయి. రెవెన్యూకు సంబంధించి జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోనే అర్బన్, రూరల్ తహసీల్ ఆఫీస్‌లు కొనసాగుతున్నాయి.


