నిర్మల్
8లోu
ప్రత్యేక అలంకరణలో ప్రార్థన మందిరాలు అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభం తెల్లవారుజాము వరకు ప్రత్యేక ప్రార్థనలు.. మత బోధనలు
వాతావరణం
ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయి. పగలు కూడా చల్లగానే ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. మంచు అధికంగా కురుస్తుంది.
తగ్గుతున్న పత్తి ధరలు
పత్తి ధరలు తగ్గుతున్నాయి. ధర పెరుగుతుందని నిల్వ చేసుకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు తగ్గడంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది.
విద్యుత్ దీపాల
వెలుగులో మెరిసిపోతున్న నిర్మల్ క్యాథలిక్ చర్చి
నిర్మల్‌టౌన్: క్రైస్తవులకు అత్యంత ప్రియమైన క్రిస్మస్ పండుగ సందడి బుధవారం సాయంత్రం నుంచే మొదలైంది. నెల రోజులుగా సెమీ వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చీలలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త దుస్తుల్లో భక్తులు పిల్లలతో కలిసి చేరుకుని భక్తిగీతాలు ఆలపించారు. ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము వరకు బిషప్‌లు, పాస్టర్లు ఏసు బోధనలు వినిపించారు. కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
చర్చిల అలంకరణ..
చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల ఆకృతులతో అద్భుతంగా అలంకరించారు. ఏసు జన్మకథకు సంబంధించిన ప్రతిరూపాలు, శాంతాక్లాస్ ఆకారాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఎరుపు దుస్తుల్లో శాంతా క్లాస్ సందడి చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు.
పురాతన సీఎస్‌ఐ చర్చి..
నిర్మల్ పట్టణం గాజులపేట్‌లోని సీఎస్‌ఐ చర్చి నిర్మాణం 1925లో ప్రారంభమైంది. 1930లో పూర్తయింది. దీనిని పీజేఎస్, అప్పదోరై నిర్మించారు. ఈ చర్చి 16 ఎకరాల ప్రాంగణంలో ఉంది. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి మేసీ్త్రలు, ఇంగ్లండ్ నుంచి రంగుచిత్రాలు తెచ్చారు. గురువారం ఉదయం 9:30 నుంచి ప్రార్థనలు మొదలవుతాయి. అనంతరం బిషప్ వాస్య ధ్యానం జరుగుతాయి. తర్వాత కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ, అనాథ ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్ పంచుతారు.
అతిపెద్ద నిస్సీ చర్చి
వెంకటాపూర్ శివారులో 2021లో పూర్తయిన నిస్సీ చర్చి పట్టణంలోని అతిపెద్దది. 1995–2021 వరకు శాస్త్రినగర్‌లో ఉండేది. పాస్టర్ జయరాజ్ నేతృత్వంలో నిస్సి ట్రస్ట్ అనాథ పిల్లల చదువు, దుప్పట్లు, దుస్తులు అందిస్తోంది. గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు, గీతాలు, నృత్యాలు జరుగుతాయి. 26వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. సెయింట్ థామస్, గొల్లపేట్ చర్చిలలో కూడా
ప్రార్థనలు జరుగుతాయి.
చరిత్రకు సాక్ష్యం సీఎస్‌ఐ చర్చి
తెలంగాణలో రెండో పెద్ద చర్చి లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చి. చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యం. చర్చి నిర్మించి 90 సంవత్సరాలు పూర్తయినా చెక్కు చెదరలేదు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


