ఏఎంసీ వైస్‌చైర్మన్ రాజీనామా
సారంగపూర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు నెరవేర్చలేదని సారంగాపూర్ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవికి లక్కడి శంకర్‌రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్‌కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీని కలిసిన టీయూటీఎఫ్ నేతలు
నిర్మల్ రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తమ గళం వినిపించాలని కోరారు. విద్యారంగ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.మురళీమనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


