కడెం నిలబడింది | - | Sakshi
Sakshi News home page

కడెం నిలబడింది

Aug 20 2025 5:11 AM | Updated on Aug 20 2025 5:11 AM

కడెం

కడెం నిలబడింది

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025 ● బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

8లోu

న్యూస్‌రీల్‌

రూ.9 కోట్లతో పూర్తిస్థాయి మరమ్మతులు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’ ఇక ఎలాంటి ప్రమాదం లేదని భరోసా.. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

నిర్మల్‌

వంతెన నిర్మాణం

త్వరగా పూర్తి చేయాలి

సారంగపూర్‌: భారీ వర్షాలకు కోతకుగురైన వంతెనలు, రోడ్ల పునర్నిర్మాణం త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. నిర్మల్‌–స్వర్ణ ప్రధాన రహదారిపై కోతకు గురైన వంతెనను మంగళవారం పరిశీలించారు. అక్కడే ఉన్న ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసరావుకు, పీఆర్‌ డీఈ తుక్కారంకు వంతెన వద్ద రక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టును సందర్శించారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు ఏఈ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు, గేట్ల పరిస్థితి గురించి వాకాబు చేశారు. ఆయన వెంట తహశీల్దార్‌ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, బీజేపీ మండల అధ్యక్షుడు నరేశ్‌ తదితరులు ఉన్నారు.

కడెం: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి మంగళవారం కడెం ప్రాజెక్టును సందర్శించా రు. ఈ సందర్భంగా వరద నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వహణను నిర్లక్ష్యం చేసి ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.9 కోట్లతో చేపట్టిన మర్మతులతో ప్రస్తుతం ప్రాజెక్టు నిలబడిందని, భారీ వరదలను సైతం తట్టుకుంటోందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోత ట్టు ప్రాంతాల్లో రహదారులు, పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేలా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, ముందస్తు సమాచారం అందించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

నష్ట అంచనాకు ఆదేశం..

వర్షాలు తగ్గిన వెంటనే సంబంధిత శాఖలు నష్ట అంచనా సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.

టూరిజం అభివృద్ధి..

కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. స్థాని క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. మంత్రి వెంట కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల, ఎమ్మెల్సీ దండే విఠల్‌, అదనపు కలెక్టర్లు పైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నాకళ్యాణి, ఎస్‌ఈ వెంకటరాజేంద్రప్రసాద్‌, ఈఈ విఠల్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీడీవో అరుణ, ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

ఆర్జీయూకేటీలో ఇండక్షన్‌ ప్రోగ్రాం

ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు మంగళవారం ఇండక్షన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. వీసీ గోవర్ధన్‌, ఓఎస్డీ మురళీదర్శన్‌ మాట్లాడారు.

పునర్నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలి

కడెం నిలబడింది1
1/1

కడెం నిలబడింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement