జిల్లాలో ‘మహా’ వరద
నిర్మల్: వర్షం, వరద ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలో వర్షం తగ్గినా.. ఎగువన మహారాష్ట్రలో జోరువానలతో జిల్లాలో వరదలు వస్తున్నాయి. నాందేడ్ జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌తో భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం జిల్లాపై ఇంకా కొనసాగుతూనే ఉంది. గోదావరి నది ఉప్పొంగుతోంది. సమీప గ్రామాలకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టులకూ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
‘మహా’ ఎఫెక్ట్..
జిల్లాకు పక్కనే ఉన్న నాందేడ్‌లో రెండురోజుల క్రితం క్లౌడ్‌బరస్ట్‌తో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. దీని ప్రభావం జిల్లాపైనా పడుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరితోపాటు సుద్ధవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులకూ ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది.
ఉప్పొంగుతున్న గోదావరి..
బాబ్లీ నుంచి బాసర మీదుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 2.28 లక్షల క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీలోకి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మొత్తంగా శ్రీరాంసాగర్ ఎగు వ, దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
వర్షసూచన..
జిల్లాలో బుధవారం కూడా మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దులోని భైంసా, కుభీర్, కుంటాల తదితర మండలాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రణాళికశాఖ సూచిస్తోంది. దీంతో బుధవారం జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ అభిలాష అభినవ్ సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. ప్రమాదకర వాగులు, నీటిప్రవాహం ఉన్న లోలెవల్ వంతెనలను ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు.
ప్రాజెక్టుల సమాచారం..
ప్రాజెక్టు మొత్తం ప్రస్తుత ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో
(టీఎంసీల్లో..) (క్యూసెక్కుల్లో..)
కడెం 4.699 3.416 13,383 22,583
ఎస్సారెస్పీ 80.5 72.99 2,28,000 4,03,867
స్వర్ణ 1.037 0.831 2,100 1,965
గడ్డెన్నవాగు 1.83 1.685 3,000 00
ఖానాపూర్‌లో ఉధృతంగా గోదావరి


