
ఖరీఫ్‌కు ఢోకా లేదు
పది రోజుల కిందటి వరకు సరైన వర్షాలు లేక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేక ఆందోళన చెందాం. కానీ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలాగా మారింది. దీంతో ఖరీఫ్ పంటలకు ఇక ఢోకా లేదు. ముమ్మరంగా పంటలు సాగు చేస్తున్నాం.
– గంగారెడ్డి, రైతు చామన్‌పెల్లి
సంతోషంగా ఉంది
మా మండల రైతులకు వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. ప్రాజెక్టు నిండితే మాకు భరోసా. ఈసారి పది రోజుల క్రితం వరకు పెద్దగా వరద రాలేదు. ఇప్పడు నిండుతుండడం సంతోషంగా ఉంది. దీంతో పంటల సాగుకు ఇబ్బంది ఉండదు. వేసవిలో తాగునీటి సమస్య కూడా రాదు.
– సాయన్న,రైతు, పొట్టపెల్లి(కె)

ఖరీఫ్‌కు ఢోకా లేదు