
పోరాట యోధుడు పాపన్నగౌడ్
నిర్మల్‌చైన్‌గేట్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట యోధుడని, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవా రం పాపన్నగౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పాపన్నగౌడ్ బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి కృషిచేశారన్నారు. పాపన్నగౌడ్ పేరు నేటికీ సమానత్వం, పోరాటస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆర్డీవో రత్నకళ్యాణి, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, డీటీవో సరోజ, గౌడ సంఘం నాయకులు ముష్కం రామకృష్ణాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.