
యూరియా కొరత లేకుండా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పత్తి, సోయా, వరి, మొక్కజొన్న పంటలకు ఆగస్టులో యూరియా అవసరం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈమేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రతిరోజూ యూరియా పంపిణీపై రిపోర్ట్ అందజేయాలని తెలిపారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా విజిలెన్స్ మానిటరింగ్ కఠినంగా చేపట్టాలన్నారు.
యూరియా కొరతలేదు..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరతలేదని పేర్కొన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా బార్డర్ చెక్‌పోస్టుల వద్ద పోలీ స్, నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్నారు. రై తులకు ఎరువులు సులభంగా అందేలా షాపులను ఉదయం నుంచే తెరిచి ఉంచుతున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ జానకీషర్మిల, డీఏవో అంజి ప్రసాద్, సీపీవో జీవరత్నం, అధికారులు పాల్గొన్నారు.
నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై విభాగాలవారీగా పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. వరద ల కారణంగా రహదారులు, వంతెనలు, పంటలు, నివాస గృహాలు దెబ్బతిన్న ప్రాంతాల పై నివేదికలు సమర్పించాలన్నారు. రహదా రులు, వంతెనలు, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వైద్యాధికారులు ఫీవర్ సర్వే నిర్వహించి అవసరమైనచోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాలవారీగా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. శానిటేషన్ పనులు కొనసాగించాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.