
ఖరీఫ్‌కు శ్రీరామరక్ష
న్యూస్‌రీల్
నిర్మల్
నేడు జిల్లాకు మంత్రి ‘జూపల్లి’
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నిర్మల్, ఆదిలాబాద్, జిల్లాల్లో పర్యటిస్తారు. వర్ష ప్రభావి త ప్రాంతాలను సందర్శిస్తారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గాన 10 గంటలకు నిర్మల్‌కు చేరుకుంటా రు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్‌లో వరదలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
శిశువు విక్రయం?
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రి లో ఓ మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. మూ డో సంతానం కూడా ఆడపిల్లే పుట్టడంతో అమ్మేందుకు సిద్ధమైంది. సంతానం లేని ఓ వ్యక్తి మధ్యవర్తికి డబ్బులు ఇచ్చి శిశువును తీసుకెళ్లాడు. ఆ మధ్యవర్తి డబ్బులు మహిళకు ఇవ్వకుండా పారిపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారని తెలిసింది.
నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
లక్ష్మణచాంద: నిర్మల్ వ్యవసాయ ఆధారిత జిల్లా. సుమారు 3 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉంది. అంతే మొత్తంలో రైతులు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో పంటల సాగుకు ప్రధాన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని కడెం, గడ్డెన్న, స్వర్ణ, సదర్మాట్ ప్రాజెక్టులు ఆదరువు. వీటితోపాటు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, కాలువలతోపాటు వర్షాధారంగానూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. బోర్లు, బావుల కింద సాగువిస్తీర్ణం చాలా తక్కువ. ఈ ఏడాది రెండు నెలలుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో జిల్లా రైతుల్లో సాగుపై ఆందోళన నెలకొంది. కానీ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాత మోములో ఆనందం కనిపిస్తోంది. జిల్లాలోని సాగు, తాగు నీటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరప్రదాయిని. వారం రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురవకపోవడంతో ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తి స్థాయిలో లేక, జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇటీవలి భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ జలాశయంతోపాటు జిల్లాలోని కడెం, స్వర్ణ, సదర్మాట్ జలాశయాలు పూర్తిగా నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటకు ఇక ఢోకా లేదని సాగు పనులను ముమ్మరం చేశారు.
సరస్వతి కాలువ..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే సరస్వతి కాలువ జిల్లాలోని 33,622 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తోంది. ఈ కాలువ నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల పరిధిలో 47 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. మొత్తం 28 డిస్ట్రిబ్యూటరీ కాలువలతో ఈ కాలువ జిల్లా రైతులకు సాగునీటిని సమర్థవంతంగా అందిస్తోంది. ఇటీవల సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.
శ్రీరాంసాగర్‌కు భారీ వరద..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1089.2 అడుగుల (74.128 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. సోమవారం ప్రాజెక్ట్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు కొనసాగడంతో ప్రాజెక్ట్ 34 గేట్లను ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరినదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు. రేపటి వరకు జలాశయ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూడో‘సారి’
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ దేవాలయం వద్ద నిర్వహించే వివిధ వ్యాపారాలకు మూడోసారి సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం వాయిదా పడింది. కొబ్బరికాయలు విక్రయించే హక్కు, ప్యాలాలు పుట్నాలు విక్రయం, బొమ్మలు, సీడీలు కంకణాలు విక్రయించే దుకాణం, టోల్‌ట్యాక్స్ వసూలు, పూల దండలు విక్రయించే హక్కునకు అధికారులు వేలం నిర్వహించారు. కేవలం పూలదండలు విక్రయించే హక్కులను రూ.1.64 లక్షలకు హెచ్చు పాడి సత్యనారాయణ దక్కించుకున్నారు. మిగతా నాలుగు వ్యాపారాలకు ధరావత్తు సొమ్ము చెల్లించడానికి వ్యా పారులు ముందుకు రాలేదు. ఈనెల 28న మళ్లీ వేలం నిర్వహిస్తామని ఈవో రమేశ్ తెలిపారు.
జూపల్లి గారూ.. ఎన్నేళ్లీ గోస!
జిల్లాలో ప్రాజెక్టులు, ఆయకట్టు వివరాలు..
ప్రాజెక్టు పేరు ఆయకట్టు
(ఎకరాల్లో..)
శ్రీరాంసాగర్ 33,622
స్వర్ణ ప్రాజెక్టు 8,945
కడెం ప్రాజెక్టు 68,150
గడ్డెన్నవాగు ప్రాజెక్టు 13,950
సదర్మాట్ 13,000

ఖరీఫ్‌కు శ్రీరామరక్ష