
ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కుంటాల: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు నెలకొల్పిందని, ఇందులోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆదర్శ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. కుంటాల ఆదర్శ పాఠశాలను సోమవారం సందర్శించారు. విద్యార్థులు చదువుతోపాటు పలు రంగాల్లో రాణించాలని సూచించా రు. పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులు బోధిస్తున్న ట్లు తెలిపారు. విద్యార్థులను వారికి ఆసక్తి ఉన్నరంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నా రు. వృత్తివిద్యా కోర్సులు, ఆన్‌లైన్ తరగతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఉమ్మడి ఆదిలాబాద్ నోడల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు ఉన్నారు.
వేతనాలు ఇప్పించాలని వినతి
ఐదు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఆయన వేతనాలు అందేలా చూస్తానని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గజేందర్, మమత, మూసాఖాన్, గంగాధర్ తదితరులు ఉన్నారు.