ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: గోదావరి తీర గ్రామాలు దేవునిగూడెం ,భూత్కూర్, రాంపూర్, మున్యాల, గోడిసిర్యాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. ఆయా గ్రామాల్లో గోదావరి ఉధృతిని మంగళవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుందని తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో సునీత, ఎస్సై సాయికుమార్, ఎంపీవో రమేశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రామకృష్ణ, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


