
నిర్మల్ అభివృద్ధికి కృషి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ అభివద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. నియోజకవర్గంలో 16 ఆలయాలకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈమేరకు మంజూరు పత్రాలను మండల నాయకులకు అందజేశారు. నిర్మల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధుల రూ.100 కోట్లతో అమృత్ తాగునీటి పథకానికి 62.50 కోట్లు, నీటి శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణాలకు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిర్మించిన చెక్‌డ్యాంలతో పట్టణంలోని జీఎన్‌ఆర్ కాలనీ ముంపుకు గురైందన్నారు. కార్యక్రమంలో రాంనాథ్, మెడిసెమ్మ రాజు, ముత్యంరెడ్డి, ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, చిన్నయ్య, రమేష్, విలాస్, విజయ్, శ్రీధర్ రెడ్డి , మధు పాల్గొన్నారు.