
వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్ కలెక్టర్..
భైంసా: భారీ వర్షాల నేపథ్యంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ పట్టణంలో పరిస్థితిని సమీక్షించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికా రులతో కలిసి రాహుల్ నగర్, ఆటోనగర్, ఫూలే నగర్ ప్రాంతాలను సందర్శించారు. వరద ప్రభావిత పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడ్డన్న వాగు ప్రాజెక్ట్ వద్దకు చేరుకని ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.