
కడెంకు పొటెత్తిన వరద
కడెం: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శనివారం కడెం ప్రాజెక్టుకు వరద పొటెత్తింది. 1,95,923 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో రావడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి 2,04,183 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వరద సమాచారంతో కలెక్టర్ అభిలాష అభినవ్ అదేశాలతో ఇరిగేషన్ అధికారులు ముందస్తుగానే గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటిమట్టాన్ని తగ్గించారు. దీంతో 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినా ఇబ్బందులు లేకుండా నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు వరద గేట్లు మోరాయించకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 691.875 అడుగుల నీటిమట్టం వద్ద స్థిరంగా ఉంచుతున్నామని ఈఈ విఠల్ తెలిపారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, విద్యుత్ శాఖ ఏఈఈ రాంసింగ్ తదితర అఽధికారుల బృందం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు.
ఇన్‌ఫ్లో పెరిగిందిలా..
శనివారం తెల్లవారుజాము నుంచి..
గంటలకు 863
గంటలకు 2,388
ఉదయం గంటలకు 5,455
గంటలకు 16,764
గంటలకు 86,994
గంటలకు 102040
గంటలకు 1,45,485
గంటలకు 1,95,923