
ప్రాజెక్టుల పరిసరాలకు వెళ్లొద్దు
కడెం/సారంగాపూర్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు, వాటి పరీవాహక ప్రాంతాలతోపాటు వాగులు, నదుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పశువుల కాపరులు తమ పశువులను నది–వాగుల దారుల్లోకి తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టులను శనివారం కలెక్టర్ సందర్శించారు. కడెం ప్రాజెక్టును ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ సందర్శించారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అంతకుముంఉద స్వర్ణ ప్రాజెక్టును పరిశీలించారు. ఈఈ అనిల్ జాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరు వరదగేట్ల ద్వారా 80 వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నామని తెలిపారు. అత్యవసరమైతే 91005 77132ను సంప్రదించాలని సూచించారు.
కడెం ప్రాజెక్టుపై కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు