బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరికొన్ని రోజుల్లో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వారం రోజులు గా భక్తులు భారీగా వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూ జలు చేయిస్తున్నారు. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులు వేకువజామున గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతి, శ్రీమహాకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరి పించారు. రూ.1000 అక్షరాభ్యాస టికెట్లు 255, రూ.150 అక్షరాభ్యాస టికెట్లు 650 విక్రయించా రు. ఇతర అర్జిత సేవల ద్వారా మొత్తం రూ. 8.70 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బాసరకు పోటెత్తిన భక్తులు


