పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి
లోకేశ్వరం: రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంబించాలని ముధోల్ ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ నర్సయ్య అన్నారు. మండలంలోని రాజూర గ్రామ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం గురువా రం నిర్వహించారు. వానాకాలంలో సాగుచేసే పంటలపై రైతుల ప్రశ్నలకు నర్సయ్య సమాధానం ఇచ్చారు. జీవన ఎరువుల వాడకం, రసాయనిక పురుగు మందుల వాడకం, త క్కువ యూరియా వడటం ద్వారా ఆదాయాన్ని ఎలా పొందాలో వివరించారు. మరో శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ చెట్లు పెంచడం వలన పర్యావరణానికి కలిగే మేలును తెలియజేశారు. వివిధ పంటలకు అవసరం మేరకు రసాయనాల వినియోగిస్తే పంట దిగుబడి శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లోకేశ్వరం ఇన్‌చార్జి పశువైద్యాధికారి రవీందర్, ఏవో గిరిరాజ్, ఏఈవోలు మౌనిక, రుచిత, ఎఫ్‌పీవో నవీన్ పాల్గొన్నారు.


