ఫస్ట్‌రోజే పాఠ్యపుస్తకాలు
లక్ష్మణచాంద: పాఠశాలల పునఃప్రారంభం రోజే వి ద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాకు 90 శాతం పుస్తకాలను అన్ని మండలాల ఎమ్మార్సీలకు సరఫరా చేసింది. జిల్లాకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 3,40,220 అవసరముండగా ఇప్పటికే 3,06,740 వచ్చాయి. ఇంకా 33,480 పుస్తకాలు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వస్తాయని అధికారులు చె బుతున్నారు. పార్ట్–2 పుస్తకాలు సెప్టెంబర్‌లో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. 6–10 విద్యార్థులకూ పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌బుక్స్ అందజేయనున్నారు. 1–5 తరగతుల విద్యార్థులకు ఇంకా నోట్‌బుక్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వస్తే వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బడిబాట షెడ్యూల్ ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏటా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 6న స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి. 7న ఉపాధ్యాయులు ప్రతీ ఇంటికి వెళ్లి బడీడు పిల్ల లను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. డ్రాపౌట్స్‌ను గుర్తించి పాఠశాలల్లో, ప్రత్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి సమీప భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీన 6నుంచి 10వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి. 12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు అందించాలి. 13న ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి. 16న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (లిప్) దినోత్సవాలను జరపాలి. అన్ని తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్ ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో తరగతి గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్‌ఎల్‌ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17న సమీకృత విద్య, బాలిక విద్యాదినో త్సవం నిర్వహించి బాల్య వివాహా లు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18న త ల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇత ర ఆధునిక సౌకర్యాలు చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వి ద్యార్థులకు వివరించాలి. 19న బడిబా ట ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించాలి.
ఈ నెల 23 వరకు జిల్లా సమాచారం
ప్రాథమిక పాఠశాలలు 577
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
ఉన్నత పాఠశాలలు 164
కేజీబీవీలు 18
మొత్తం పాఠశాలలు 848
మొత్తం విద్యార్థులు 71,390
అవసరమైన పార్ట్–1 పుస్తకాలు 3,40,220
ఇప్పటివరకు వచ్చినవి 3,06,740
ఇంకా రావాల్సినవి 33,480


