నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Dec 29 2025 9:09 AM | Updated on Dec 29 2025 9:09 AM

నిర్మ

నిర్మల్‌

సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 8లోu ●

‘నిర్మల్‌ ఉత్సవాల’తో ప్రారంభం

‘డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌’ కోసం ప్రయత్నం

‘యూనివర్సిటీ’ కోసం ఉద్యమం

ఆలయంలో కొలువైన అడెల్లితల్లి

రైల్వేలైన్‌ కోసం మరింత చొరవ

ప్రధాన పార్టీలకు కొత్త అధ్యక్షులు

జాతర సమీపిస్తున్నా..

నాగోబా జాతర జనవరి 18న ప్రారంభం కానుంది. గడువు సమీపిస్తున్నా ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. అధికారుల సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు.

న్నో కొత్త ఆశలతో సరిగ్గా పన్నెండు నెలలక్రితం 2025 ప్రారంభమైంది. ఎన్నో.. ఎన్నెన్నో సరికొత్త విషయాలు, సంఘటనలు, నియామకాలు, ముందడుగులు, ఉద్యమాలకు వేదికై ంది. ఒక్కోనెల ఒక్కో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయం మొదలు క్రీడా, కళారంగాల వరకు ఈ ఏడాది ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. – నిర్మల్‌

ఆ పార్టీలకు కొత్త సారథులు..

జిల్లా ఈ ఏడాది రాజకీయంగానూ పలుమార్పులకు వేదికై ంది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ, ఒక ఎమ్మెల్యేను గెలుచుకున్న కాంగ్రెస్‌ బలపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్‌రాథోడ్‌, నవంబర్‌లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే బొజ్జుపటేల్‌ నియమితులయ్యారు. తొలిసారి పంచాయతీ ఎన్నికలనూ ఇదే ఏడాదిలో వారు ఎదుర్కొన్నారు.

సిందూర.. సంబురం..

పాకిస్థాన్‌ ముష్కరమూకలు చేసిన పహల్గాం మారణహోమాన్ని జిల్లా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. అనంతరం మనదేశం మే నెలలో చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్‌ జరిగినన్ని రోజులూ ఊపిరి బిగబట్టి వార్తలను తెలుసుకుంది. విజయం తర్వాత గల్లీగల్లీలో పండుగలా జరుపుకుంది.

ఆశల రైలుకు అడుగులు..

జిల్లా మీదుగా రైల్వేలైన్‌కు సంబంధించి ఈ ఏడాదిలో కీలక పరిణామం పూర్తయ్యింది. ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు మూడు జిల్లాలను కలుపుతూ 136.50 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్‌ పూర్తి చేశారు. దీన్ని వెంటనే ఆమోదించాలని ఎంపీ నగేశ్‌ రైల్వేబోర్డు చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ను కలిశారు. ఇదేనెలలో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తదితరులతో కలిసి బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి విన్నవించారు.

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వస్తున్న పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రశాంతంగా ముగిశాయి. దస్తురాబాద్‌ మండలం పెర్కపల్లి మినహా మొత్తం 399 పంచాయతీలకు కొత్త సర్పంచులు వచ్చారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా మద్దతుదారులను గెలిపించుకున్నాయి.

క్రీడలతో మానసికోల్లాసం

నిర్మల్‌టౌన్‌: క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వాకింగ్‌ అండ్‌ లాఫింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

వర్సిటీ కోసం ‘సాక్షి’ ప్రయత్నం..

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు

‘నిర్మల్‌ ఉత్సవాలు’

తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఆ జిల్లా పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నిర్మల్‌ జిల్లాగా ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఈ ఏడాది జనవరి 5, 6, 7 తేదీల్లో ‘నిర్మల్‌ ఉత్సవాలు’ పేరిట ప్రారంభించారు. మూడురోజులు జనాల నుంచి విపరీతంగా స్పందన ఉండటంతో మరో రోజు అదనంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా చరిత్రనూ ప్రజల్లోకి తీసుకెళ్లారు.

నేటి నుంచి ప్రజావాణి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 29 నుంచి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి హాజరై నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదులను అందజేయాలని సూచించారు.

మౌంటెన్‌మ్యాన్‌.. ఐరన్‌మ్యాన్‌..

ఈ ఏడాది జిల్లాకు ఇద్దరు సూపర్‌మ్యాన్లు దొరికారు. గతంలో ఎవరెస్టును అధిరోహించిన జిల్లా కేంద్రానికి చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ ముక్క సాయిప్రసాద్‌ జూన్‌లో ప్రపంచంలో ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్నీ అధిరోహించి మౌంటెన్‌మ్యాన్‌గా నిలిచారు. ఇక జిల్లా కేంద్రానికే చెందిన డాక్టర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి గోవాలో నిర్వహించిన క్లిష్టమైన అరేబియా సముద్రంలో ఈత, సైక్లింగ్‌, మారథాన్‌ల ఈవెంట్‌ను విజయవంతంగా ముగించి ‘ఐరన్‌మ్యాన్‌’ టైటిల్‌ దక్కించుకున్నారు.

జిల్లాలో జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన ఉద్యమానికి ‘సాక్షి’ మీడియా బీజం వేసింది. ఈఏడాది ఆగస్టులో వివిధ వర్గాలు, మేధావులు, విద్యావంతులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది. ఈ కారణంగా జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి’ ఏర్పడింది.

డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌ దిశగా..

జిల్లాలో విపరీతంగా వ్యాపిస్తూ యువతను పట్టి పీడిస్తున్న గంజాయి భూతాన్ని తరిమేసేందుకు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌వ్‌, ఎస్పీ జానకీ షర్మిల డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌ కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇదే ఏడాది జిల్లాలో గంజాయితో పాటు మత్తు మందు సిరంజీలనూ ఉపయోగిస్తున్నట్లు తేలడం కలవరపర్చింది. ఆ ముఠానూ పోలీసులు పట్టుకున్నారు. దసరా పండుగ సమయంలో ఎస్పీ జానకీ షర్మిల వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లి డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, తదితర సామాజిక అంశాలను వివరించేందుకు ‘కమ్యూనిటీ బతుకమ్మ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిర్మల్‌1
1/7

నిర్మల్‌

నిర్మల్‌2
2/7

నిర్మల్‌

నిర్మల్‌3
3/7

నిర్మల్‌

నిర్మల్‌4
4/7

నిర్మల్‌

నిర్మల్‌5
5/7

నిర్మల్‌

నిర్మల్‌6
6/7

నిర్మల్‌

నిర్మల్‌7
7/7

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement