తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
ఖానాపూర్: కొద్దిరోజులుగా కురిసిన అకాల వర్షాల కు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సుర్జాపూర్, బాదనకుర్తి తదితర గ్రామాల రైతులు డిమాండ్ చే శారు. శుక్రవారం మండలంలోని సుర్జాపూర్‌లో ఖా నాపూర్–మెట్‌పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తహసీల్దార్ సుజాత, ఐకేపీ ఏపీఎం భోజ న్న అక్కడికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. నాయకులు, రైతులు బూసి నరేందర్, బక్కశెట్టి అశోక్, శని గారపు శ్రావణ్, అన్ప హరీశ్, సుద్దాల మహిపాల్, బొమ్మెన రాకేశ్, బర్లపాటి రాజేందర్, పుప్పాల ఉపేందర్, తుప్ప నరేందర్ తదితరులున్నారు.


